హన్మకొండ లో ఎండకు పూర్తిగా కాలిపోయిన కారు

రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఉదయం 8 దాటితేనే సూర్యుడు భగభగమంటున్నాడు. కాలు బయట పెట్టాలంటే ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఈ ఎండ తీవ్రతకు ఓ కారు పూర్తిగా కాలిపోయిన ఘటన హన్మకొండ లో చోటుచేసుకుంది.

చెల్పూరుకు చెందిన కొలుగూరి శ్రీనివాస రావు అనే వ్యక్తి హాస్పటిల్ పని కోసం తన కారులో సిటీకి వచ్చాడు. రోడ్డు పక్కన కార్ పార్క్ చేసి హాస్పిటల్ లోకి వెళ్లిండు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి కారులో మంటలు చెలరేగుతూ కనిపించాయి. ఇక అప్పటికే కారు సగానికి పైగా కాలిపోయింది. స్థానికులు నళ్లా నీళ్లతో మంటలను ఆర్పేశారు.