‘ఖుషి’ సినిమా షూటింగ్ పూర్తి..

విజయ్ దేవరకొండ , సమంత జంటగా మజిలీ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ఖుషి. గత కొద్దీ నెలలుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ మూవీ..మంగళవారంతో షూటింగ్ అంత పూర్తి చేసుకుంది. చిత్రయూనిట్ స్వయంగా సినిమా చివరి రోజు షూటింగ్ స్పాట్ నుంచి ఓ చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో గుడిలో కుటుంబసభ్యులంతా యాగం చేస్తున్నట్టు చూపించారు. సమంత రెడ్ కలర్ చీర కట్టుకోగా విజయ్ షర్ట్, పంచ కట్టుకున్నాడు.

ఇలా సాంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరూ నమస్కారం పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. షూటింగ్ అయిపోవడంతో ఖుషి సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఫ్యామిలీ, లవ్ ఎంటర్టైనర్ తో విజయ్, సమంత మెప్పిస్తారని సమాచారం. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ఓ పాట అందర్నీ మెప్పించి యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేస్తోంది. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. లైగర్ తో భారీ ప్లాప్ అందుకున్న విజయ్..ఈ మూవీ ఫై గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు.