భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ, ఆరెస్సెస్ లు దాడి చేస్తున్నాయి – రాహుల్

కర్ణాటక లో వచ్చే నెల 10 న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ ప్రచారంలో బిజీ గా ఉన్నారు. భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ, ఆరెస్సెస్ లు దాడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు రాహుల్ గాంధీ. అవినీతి బీజేపీ పాలనకు చరమగీతం పలికేందుకు కర్ణాటక ప్రజలంతా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని , కనీసం 150 స్థానాల్లో గెలిపించడం ద్వారా పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని రాహుల్ కోరారు.

బీజేపీకి 40 సీట్లు ఇస్తే చాలని… అంతకంటే ఎక్కువ అవసరం లేదని అన్నారు. 40 శాతం కమీషన్లు తీసుకునే బీజేపీని 40 సీట్లకే పరిమితం చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఓబీసీ డేటాను పబ్లిక్ డొమైన్ లో ఉంచుతామని చెప్పారు. ఆదివాసీలకు వారి జనాభాను బట్టి రిజర్వేషన్ అమలు చేస్తామని తెలిపారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఎన్నికల హామీలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.