పదవి చేపట్టిన కొద్ది గంటల్లోనే రాజీనామా చేసిన స్వీడన్ ప్రధాని

స్టాక్‌హోమ్‌: స్విట్జ‌ర్లాండ్ తొలి మ‌హిళా ప్ర‌ధాని మ‌గ్ద‌లీనా అండెర్స‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజే రాజీనామా చేశారు. 12 గంట‌ల పాటు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఆమె.. కూట‌మిలో భాగ‌స్వామి అయిన గ్రీన్ పార్టీ త‌ప్పుకోవ‌డంతో ఆమె త‌న ప‌ద‌వికి గుడ్‌బై చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌ధానిగా నియ‌మితురాల‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సోష‌ల్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన మ‌గ్ద‌లీనా తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన బిల్లును తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో గ్రీన్ పార్టీ ప్ర‌భుత్వం నుంచి త‌ప్పుకున్న‌ది. ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలంటూ స్పీక‌ర్‌ను కోరినట్లు అండ‌ర్స‌న్ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/