మూడు రోజుల విరామం తర్వాత పున: ప్రారంభం అయినా లోకేష్ యాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను ఈరోజు పున:ప్రారంభించారు. ఉగాది సందర్బంగా మూడు రోజుల పాటు విరామం తీసుకున్న లోకేష్..ఈరోజు ఓబుళదేవరచెరువు మండలం ఒనుకువారిపల్లి నుంచి తిరిగి ప్రారంభించారు.

ఇప్పటి వరకు లోకేష్ 625 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు ఒనుకువారిపల్లి నుంచి పాదయాత్ర మొదలై రామయ్యపేట వద్ద ముగియనుంది. రాత్రికి రామయ్యపేట విడిది కేంద్రంలో లోకేష్ బస చేయనున్నారు.

ఈరోజు యాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.

ఉదయం :

9:00 – ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం

10:00 – గాజులకుంటపల్లిలో రైతులతో సమావేశం

10:55 – వడ్డేపల్లిలో ఎస్టీ సామాజికవర్గ ప్రముఖులతో భేటీ

11:50 – ఒడిసి గ్రామంలో భోజన విరామం

2:25 – ఒడిసి నుంచి పాదయాత్ర కొనసాగింపు

2:35 – ఒడిసి ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మైనారిటీలతో భేటీ

సాయంత్రం :

4:00 – ఒడిసి రెయిన్ బో ఎడ్యుకేషన్ అకాడమీ వద్ద బహిరంగసభలో లోకేష్ ప్రసంగం

5:45 – మొహమ్మదాబాద్ క్రాస్ వద్ద అమడగూరు స్థానికులు, సత్యసాయి వర్కర్లతో సమావేశం

6:40 – రామయ్యపేట విడిది కేంద్రంలో బస.