వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

YouTube video
Hon’ble CM of AP Flagging Off Tractors & Harvesters under “YSR Yanthra Seva Pathakam” at Guntur LIVE

గుంటూరు: సీఎం జగన్ గుంటూరులో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించారు. ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. రూ.2016 కోట్లతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు పంపిణీ చేయనున్నారు. ఆర్ బీకే స్థాయిలో రూ.15లక్షలతో యంత్రాలు, 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలు ప్రారంభించనున్నారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోంది. ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నాం. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచాం.

రూ.2016 కోట్లతో ప్రతి ఆర్‌బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోలులో స్కామ్‌లు జరిగాయి. ఇవాళ రైతు ఇష్టం మేరకే ట్రాక్టర్ల కొంటున్నామని సీఎం జగన్‌ అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/