అనర్హత వేటు..రాహుల్‌ అధికారిక బంగ్లా ఖాళీ చేయాల్సిందేనా?

Rahul may have to vacate his official bungalow in a month unless…

న్యూఢిల్లీః మోడీ అనే ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కేసు తీర్పు పర్యవసానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఆయనపై నమోదైన ఈ పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడంతో… ఎంపీగా ఆయన డిస్ క్వాలిఫై అయ్యారు.

తమ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి కోర్టు ఆయనకు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది. దీంతో, ఈలోగా ఆయన తనకు విధించిన శిక్షపై హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో ఆయన ఉంటున్న తుగ్లక్ రోడ్డులోని 12వ నంబర్ బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. 2004లో లోక్ సభకు ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు ఈ బంగ్లాను కేటాయించారు. మరోవైపు, ప్రియాంకా గాంధీకి భద్రతను తగ్గించిన నేపథ్యంలో ఆమె కూడా 2020లో తనకు కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చింది.