షర్మిల సభకు విజయమ్మ హాజరు?!

9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ

YS Sharmila- YS Vijayamma
Will Vijayamma attend the meeting?

Hyderabad: దివంగత సి ఏం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల తన నూతన పార్టీపై ప్రకటన చేసేందుకు ఈ నెల 9న ఖమ్మంలో లక్షమందితో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి కూడా భారీగా వైఎస్ అభిమానులు, షర్మిల అభిమానులు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. . తాజాగా ఈ సభకు సంబంధించిన సమాచారం తెలిసింది. . షర్మిల బహిరంగ సభకు ఆమె తల్లి విజయమ్మ హాజరుకానున్నారని తెలుస్తోంది. తన పార్టీకి తన తల్లి విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే షర్మిల ప్రకటించిన విషయం విదితమే

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/