ప్రజలకు పవన్ కల్యాణ్ సూచనలు
బాధ్యతగా ఉండే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోకపోతే ఇబ్బందులు వస్తాయి

కర్నూలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో రోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రజల సమస్యలు తీర్చే సరైన నాయకులకు ఎన్నికల్లో ఓటేసి ఎన్నుకోవాలని ప్రజలకు పలు సూచనలు చేశారు. ‘చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోతే ఏం లాభం? బాధ్యతగా ఉండే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. కొత్త వారిని, బాధ్యతగల వారిని ఎన్నుకోకపోతే ఎలా? పని చేయని వారి గురించి ప్రజలు ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు ప్రజలు బాగా ఆలోచించాలి. కర్నూలులోనే కాదు అన్ని జిల్లాల ప్రజలు ఆలోచించాలి. డబ్బులు పడేశాం కాబట్టి ప్రజలు ఓటేశారని, ఇక వారి కోసం పని చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యేలు భావిస్తారు. కనుక ఆలోచించి పని చేసే వారికి ఓటేయాలి. ప్రలోభాలకు గురై ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే సమస్యలు తలెత్తుతాయి. ప్రజాధనం దుర్వినియోగమవుతుంటే చాలా బాధేస్తోంది’ అని చెప్పారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/