అమరావతి నిరసనలకు 300 రోజులు

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించడం లేదు

chandrababu

అమరావతి: ఏపిలో రాజధాని అమరావతిపై రైతులు చేస్తున్న ఆందోళనలు 300 రోజులకు చేరుకున్న వేళ, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. ‘రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమానికి 300 రోజులు. ఉద్యమంలో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టు’ అని ఆయన అన్నారు. ఆపై, ‘అటువంటి రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలుగా మనందరి బాధ్యత. అంతేకాదు రాజధాని కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. అందుకే రాష్ట్రమంతా ఒక్కటిగా నిలిచి అమరావతి కోసం పోరాడుదాం. ఇది చారిత్రాత్మక అవసరం’ అని చంద్రబాబు అభిప్రాయడ్డారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/