యువగళం క్యాంపు వద్ద నారా లోకేష్ నిరసన

చంద్రబాబు ను కలిసేందుకు నారా లోకేష్ కు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం తో యువగళం క్యాంపు ఆఫీస్ వద్దే లోకేష్ నిరసనకు దిగారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు లో శనివారం ఉదయం CBI చంద్రబాబు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన తండ్రి అరెస్ట్ వార్తలు తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నంద్యాల వెళ్లేందుకు యత్నించారు. ఆయనను కోనసీమలో పోలీసులు అడ్డుకున్నారు. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద రాజోలు సీఐ గోవిందరాజు అడ్డుకున్నారు.

సీఐతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని చూసేందుకు వెళ్ళే హక్కు తనకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో నేలపై బౌఠాయించి లోకేష్ నిరసనకు దిగారు. లోకేష్ వద్దకు కనీసం మీడియాను సైతం రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్ళకూడదా అని పోలీసులను లోకేష్ నిలదీశారు.