1700 దాటిన కోవిడ్‌ వైరస్‌ మృతులు

death toll crosses 1700 in china
death toll crosses 1700 in china

చైనా: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 దేశాల్లో కోవిడ్ వైరస్ విస్తరించిన సమయంలో… చైనా ఓ సంతోషకరమైన విషయం చెప్పింది. మూడు రోజులుగా తమ దేశంలో కొత్తగా కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య తగ్గుతోందని తెలిపింది. అదే నిజమైతే… త్వరలోనే ఈ వైరస్ పూర్తిగా వెళ్లిపోయే అవకాశాలుంటాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 1700 దాటింది. ఐతే… మృతుల్లో ఎక్కువ మంది… చైనాలోని వుహాన్ నగరంలో… వ్యాధి ప్రారంభమైన హుబేలోనే చనిపోతున్నారు. కొత్తగా 1843 మందికి ఈ వ్యాధి సోకగా… ఆల్రెడీ 68000 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో మరో 500 మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు.వైరస్‌ని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇవాళ్టి నుంచీ డీమానెటైజేషన్ చేస్తోంది. తద్వార ఎవరైనా ప్రస్తుతం ఉన్న కరెన్సీని బ్యాంకులో ఇస్తే… కొత్త కరెన్సీ నోట్లను ఇస్తుంది. ఈ పాత నోట్లను పారేయకుండా… ఓ చోట దాచిపెట్టబోతోంది. వాటిని రెండు వారాలపాటూ అలా ఉంచితే… ఆటోమేటిక్‌గా వాటిపై ఉన్న కొవిడ్ వైరస్ చనిపోతుంది. ఇలా చెయ్యడం వల్ల ఇప్పటికే కరోనా వైరస్ ఉన్న కరెన్సీ నోట్ల వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుందని చైనా ప్రభుత్వం చెబుతోంది. 14 రోజుల తర్వాత వాటిని తిరిగి ప్రజల్లోకి వదలనుంది చైనా సెంట్రల్ బ్యాంక్.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/