స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ చేసిన CBI ..ఆ తర్వాత వెంటనే ఇదే కేసులో మాజీ మంత్రి, గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎండాడ వద్ద ఉన్న దిశా పోలీస్ స్టేషన్ లో గంటాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం గంటా మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. అర్థరాత్రి హైడ్రామా చేసారని.. జగన్ ఆనందం కోసం మాత్రమే చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.

రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని.. మొదటిసారి తన పేరు కూడా యాడ్ చేశారన్నారు. తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. అమరావతి భూముల కేసులో తన పేరు చేర్చారని మండిపడ్డారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కొవడానికి సిద్దమేనని చెప్పారు.

చంద్రబాబు పైన సెక్షన్ 166,167,120(B), 418, 420, 465, 466, 471, 201,109, 409, 109 R/W 34&37 IPC, 25 12, 13(2), R/W 13(1)(c)(D) ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు అయింది. నాన్‍బెయిలబుల్‍ వారెంట్‍పై కెసులు నమోదు చేసిననట్లు నోటీసులో పేర్కొన్నారు.