ప్రజా సమస్యలు పోరాడేందుకు సిద్దమవుతున్న లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నారా లోకేష్ ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని ప్రకటించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు గురువారం పల్నాడు లో లోకేష్ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు.

హత్యకు గురైన జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్​.. రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. జల్లయ్య ముగ్గురు పిల్లల్ని తాను వ్యక్తిగతంగా చదివిస్తానని లోకేశ్​ హామీ ఇచ్చారు. ఇక ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి నిలదీస్తూ.. త్వరలోనే రోడ్డెక్కుతానని లోకేష్ ప్రకటించారు. తన కార్యక్రమం పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. ఇప్పటికే అధినేత చంద్రబాబు ప్రజల్లో తిరుగుతున్నారని​.. తనతో పాటు నేతలంతా ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. తన కార్యక్రమం 9గంటలు ఆలస్యమైనా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలికారు.. జగన్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో దీనిబట్టే తెలుస్తోందన్నారు.