బడ్జెట్‌కు ముందు ఏ స్టాక్స్‌ కొనుగోళ్లు బెటర్‌!

త్వరలో కేంద్ర బడ్జెట్‌

Better to buy stocks before the budget
Better to buy stocks before the budget

ముంబై: మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలోనే బడ్జెట్‌ కంటే ముందు ఎలాంటి స్టాక్స్‌ కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయనేది ఆర్థిక రంగ నిపుణులు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేప థ్యంలో స్టాక్స్‌్‌పై మంచి రిటర్న్స్‌ రావాలంటే పలు టిప్స్‌ అంది స్తున్నారు మార్కెట్‌ నిపుణులు. ప్రధానంగా రెండు సంస్థలకు చెందిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌చేసే లాభాలు గడించొచ్చుని వారు జోస్యం చెబుతున్నారు. ఇవి రాష్ట్రీయ కెమికల్స్‌ మరియు ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌. బడ్జెట్‌ 2021 కంటే ముందు ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్‌ సంస్థలో స్టాక్స్‌ కొనుగోలు చేస్తే మంచి లాభాలను ఆశించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా గ్రామీణ భారతంలో రాష్ట్రీయ కెమికల్స్‌ మరియు ఫెర్టిలైజర్స్‌కు మంచి ఆదరణ ఉంది. ఇక ఈ బడ్జెట్‌లో సబ్సిడీ సంస్థ అయిన ఆర్‌ఎఫ్‌సికి బకాయిలు చెల్లించే ప్రకటన రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు పడ్డాయని అదే సమయంలో ఆర్థికంగా కూడా భారత్‌ పుంజుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.

అదే సమయంలో రైతుల ఆదాయంను రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసు కోవడం, నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయడం వంటి సాను కూల అంశా లు ఆర్‌ఎఫ్‌సికి మేలు చేకూరుస్తా యని అందుకే ఈ స్టాక్స్‌ పుంజుకుని లాభాలు తీసు కొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక స్వల్పకాలిక లక్ష్యా లకు ఆర్‌ఎఫ్‌సి స్టాక్స్‌ లో ఇన్వెస్ట్‌చేయడం మంచిదని, స్టాక్‌ విలువ కూడా తక్కువగా రూ.65గా ఉందని చెప్పారు. ఇక స్టాక్‌ లాస్‌ విలువ రూ.52గా అంచనా వేస్తున్నారు. ఇక ఇన్వెస్ట్‌ చేసి మంచి లాభాలు పొందాలంటే మరో స్టాక్‌కు కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఉక్కు రంగం నుంచి జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ త్రైమాసికంలో ఉక్కు రంగంలో చాలా మటుకు సంస్థలు లాభాల దిశగా పయనించాయని గుర్తుచేశారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/