దాడులను ఉపేక్షించేది లేదు

-అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ ట్వీట్‍

US President Joe Biden
US President Joe Biden

Washington: ఆసియా అమెరికన్లు, పసిఫిక్‍ ద్వీపకల్పవాసులపై జాత్యంహకార దాడులను  ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ ట్వీట్‍ చేశారు.  ఇటువంటి వాటిని ఆపాలని హెచ్చరిక చేశారు. హింసాత్మకతపై తమ ప్రతిస్పందనగా వీటిపై న్యాయశాఖ జోక్యంతో పాటు అదనపు చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు ఇదిలా ఉండగా అమెరికా రెస్యూ ఫ్లాన్‍ కింద 49.5 మిలియన్‍ డాలర్లు కేటాయించింది. గృహ హింస, లైంగిక వేధింపులు నుండి బయటపడిన వారితో పాటు, తెలియక ఇబ్బందులు పడే వారికోసం కార్యక్రమాలకు వినియోగిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/