సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ దాడి కేసులో పలు కీలక విషయాలు వెల్లడి

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఫై దాడి కేసులో పోలీసులు నిందితుల నుండి కీలక సమాచారం రాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో 56 మందిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలు కు తరలించి విచారిస్తున్నారు. తాజాగా సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు, శివ లను అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తుండగా..వారి నుండి పలు కీలక సమాదానాలు చెప్పినట్లు తెలుస్తుంది.

దాడికి ముందు రోజు సుబ్బారావు , శివ లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లడం..అక్కడ అన్ని చూసి రావడం చేశారట. ఆందోళనకు కావాల్సిన లాజిస్టిక్స్‌ సమాకూర్చినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో తేలింది. హకీంపేట సోల్జర్స్‌ గ్రూపులో ఆందోళనకారులకు మద్దతిస్తున్నామని పోస్ట్‌లు సైతం పెట్టారట. విధ్వంసం కేసులో కీలక నిందితులతో సుబ్బారావు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసులో A2గా ఉన్న పృధ్విరాజ్‌ సాయి డిఫెన్స్‌ అకాడమీ విద్యార్థిగా గుర్తించారు. ప్రస్తుతం A7, A8, A9, A10, A11, A12, A62, A63 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలియజేశారు. ఇదిలా ఉంటె రేపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలు కు వెళ్లి..ఈ కేసులో అరెస్ట్ అయినా విద్యార్థులతో మాట్లాడబోతున్నారు. మరోపక్క అరెస్ట్ అయినా విద్యార్థుల తల్లిదండ్రులు చంచల్ గూడ జైలు కు వస్తూ..తమ పిల్లల్ని విడిచిపెట్టాలని కోరుతున్నారు. తమ పిల్లలకు ఏమి తెలియదని ఎవరో వారిని ఆలా చేయమని పోత్సహించారని వాపోతున్నారు.