జగన్ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందిః : నారా లోకేశ్

nara lokesh comments on ys jagan

అమరావతిః రామోజీరావుపై సిఎం జగన్ పగబట్టారంటూ టిడిపి యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. పాలకుల అవినీతిని, అసమర్థతను ప్రజల దృష్టికి తీసుకొచ్చే మీడియా సంస్థలపై పగబట్టడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని ఆయన అన్నారు. ఈనాడు మీద పగబట్టి, ఆ పగను మార్గదర్శి సంస్థలపై తీర్చుకుంటున్నారని… జగన్ శాడిజాన్ని ప్రజలంతా చూస్తున్నారని చెప్పారు.

తన చేతిలో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ తన పగ తీర్చుకోవడానికి జగన్ వాడుకుంటున్నారని… ఆ సైకో చేష్టల పట్ల ప్రజలకు జుగుప్స కలుగుతోందని లోకేశ్ అన్నారు. ఒకవేళ ఇదంతా ప్రజల శ్రేయస్సు కోసమే చేస్తున్నాం అనుకుంటే పోలవరం కట్టాలని, రాజధాని అమరావతిని నిర్మించాలని చెప్పారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న మీడియా అధినేతలను వేధించవద్దని సూచించారు. రామోజీరావుకు టిడిపి అండగా ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దీనికి తోడు #TeluguPeopleWithRamojiRao అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.