బాబ్రీ మసీదు తీర్పుపై స్పందించిన రాజ్‌నాథ్‌సింగ్

న్యాయం గెలిచింది.. రాజ్‌నాథ్‌సింగ్

Rajnath-Singh
Rajnath-Singh

న్యూఢిల్లీ: ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో ల‌క్నోలోని సీబీఐ స్పెష‌ల్ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తించారు. ఎట్ట‌కేల‌కు న్యాయం గెలిచింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ముందు ఊహించిన‌దేన‌ని, అయితే, తీర్పు కోసం సుదీర్ఘ కాలం ఎదురు చూడాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దాదాపు 28 ఏండ్లుగా విచార‌ణ జ‌రిగిన బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెష‌ల్ కోర్టు బుధ‌వారం తీర్పు వెలువ‌రించింది. నిందితులు ఉద్దేశ‌పూర్వ‌కంగా మ‌సీదు కూల్చివేత‌కు పాల్ప‌డిన‌ట్లు రుజువులు లేనందున వారంద‌రినీ నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ తీర్పు చెప్పింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/