టీ కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే భేటీ

ఈ నెల 26న చేవెళ్లలో కాంగ్రెస్ బహిరంగ సభ

Mallikarjun Kharge meet with The Congress leaders

న్యూఢిల్లీః సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈ నెల 26న జరగనున్న బహిరంగ సభలో ప్రకటించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ గురించి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి తాము క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను, అన్ని అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈ నెల 26న జరగనున్న బహిరంగ సభలో ప్రకటించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ గురించి మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో డిక్లరేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భట్టి తాము క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాలను, అన్ని అంశాలను ఖర్గే దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.