ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సిఎం జగన్‌

అమరావతి: ఏపి సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. రాత్రి 10 గంటలకు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సిఎం జగన్‌ భేటి కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పలువురు కేంద్రమంత్రులతోనూ సమావేశమయ్యే అవకాశముంది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం అందించాలని అమిత్‌షాను జగన్‌ ఈ సందర్భంగా కోరే అవకాశం ఉందని వైఎస్‌ఆర్‌సిపి వర్గాలు చెబుతున్నాయి.


దీంతోపాటు ఏపిలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షాకు జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. విగ్రహాల ధ్వంసం వెనక రాజకీయ కుట్ర ఉందని నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/