నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తారా..?

ప్రస్తుతం ఏపీ లో ఇదే చర్చ నడుస్తుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఇప్పటీకే చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైల్లో వేయగా..ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ నారా లోకేష్ ఫై CID అధికారులు ఏసీబీ కోర్ట్ లో కేసు ఫైల్ చేసారు. దీంతో లోకేష్ కూడా అరెస్ట్ చేయతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ లో ఉన్నారు. ఈ నెల 29 నుండి తన యువగళం యాత్ర ను పున: ప్రారభించబోతున్నారు. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తారని అంత మాట్లాడుకుంటున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఎల్లుండి రాత్రి 8.15 ని. లకు లోకేష్‌ యువగళాన్ని ప్రారంభించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో ఢిల్లీలో ఉండి న్యాయవాదులతో లోకేష్‌ నిత్యం సంప్రదిస్తున్నారు. అటు లీగల్‌ ఫైట్‌ కొనసాగిస్తూ.. ఇటు యువగళం తో మళ్ళీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, జగన్‌ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు నాయకులంతా ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చేయాలని నారా లోకేష్‌ నిర్ణయించారు. కానీ లోకేష్ ను CID అధికారులు అరెస్ట్ చేయొచ్చని అంత భావిస్తున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.