రెండో రోజు జ్ఞాన‌వాపి మ‌సీదులో ప్రారంభ‌మైన శాస్త్రీయ స‌ర్వే

ASI resumes work on scientific survey of Gyanvapi mosque ..

వార‌ణాసి: జ్ఞాన‌వాపీ మ‌సీదు లో ఈరోజు కూడా ఆర్కియాల‌జీ స‌ర్వే ఆఫ్ ఇండియా అధికారులు శాస్త్రీయ స‌ర్వే మొద‌లుపెట్టారు. 17వ శ‌తాబ్ధానికి చెందిన మ‌సీదులో.. ప్రాచీన కాలం నాటి హిందూ ఆల‌యం ఉందా లేదా అన్న కోణంలో పురావాస్తుశాఖ స‌ర్వే చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం కూడా మ‌సీదులో విస్తృత రీతిలో స‌ర్వే జ‌రిగింది. ఇవాళ కూడా ఉద‌య‌మే స‌ర్వే మొద‌లైంద‌ని, సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు స‌ర్వే జ‌రుగుతుంద‌ని గ‌వ‌ర్న‌మెంట్ కౌన్సిల్ రాజేశ్ మిశ్రా తెలిపారు. అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఇచ్చేందుకు శుక్ర‌వారం సుప్రీంకోర్టు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే స‌ర్వేలో భాగంగా ఎటువంటి తొవ్వ‌కాలు చేప‌ట్ట‌వ‌ద్దు అని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొన్న‌ది.