పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఫై సోము కామెంట్స్

జనసేన పార్టీ ఆవిర్భావ సభ మంగళవారం మచిలీపట్నం లో ఎంతో గ్రాండ్ గా జరుపుకుంది. లక్షలాది మంది జనసేన శ్రేణులు , కార్య కర్తలు, అభిమానులు, ప్రజలు సభకు తరలివచ్చారు. అలాగే పవన్ ర్యాలీ లో కూడా వేలాదిమంది పాల్గొన్నారు.

ఇక సభలో పవన్ కళ్యాణ్ అనేక అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఏంచేస్తుందో తెలిపారు. అలాగే పొత్తులపై కూడా క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరమవుతారని కొందరు అంటున్నారని… ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని క్లారిటీ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు… టీడీపీతో జనసేన పొత్తు గురించి పవన్ ఎక్కడ మాట్లాడలేదని అన్నారు. టీడీపీతో పొత్తుపై పవన్ క్లారిటీ ఇచ్చిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడతామని చెప్పారు. ఇక నాలుగేళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు జగన్ చేసిందేమీ లేదని వీర్రాజు విమర్శించారు. విశాఖ రాజధాని అని చెపుతూ ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసిందని చెప్పారు.