జగన్‌ను జైలు భయం వెంటాడుతోంది

ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్‌కి టిడిపి ముడిపెడుతున్నారు

nara lokesh
nara lokesh

అమరావతి: రావాలి జగన్‌ కావాలి జగన్‌ అని జైలు పిలుస్తుందన్నా భయం ముఖ్యమంత్రి జగన్‌ గారిని వెంటాడుతోందని టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌ ఎద్దేవా చేశారు. ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్‌కి టిడిపికి ముడిపెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్‌కి టిడిపికి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఇంకా మరో ట్వీట్‌ ముఖ్యమంత్రి జగన్‌కు లోకమంతా అవినీతి మయంగా కనపడటంలో పెద్దగా ఆశ్యర్యం ఏమి లేదని అన్నారు. ఐటీ రైడ్స్‌లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైందని నారా లోకేష్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/