మరోసారి డాన్స్ తో అదరగొట్టిన మంత్రి రోజా

పర్యటకశాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి రోజా చాల బిజీ అయ్యారు. ప్రతి రోజు ఏదోక ఈవెంట్ కు హాజరవుతూ సందడి చేస్తుంది. శుక్రవారం తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీ యువజన ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వేడుకకు రోజా ముఖ్య అతిథిగా హాజరై సందడి చేసారు.

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికారు కేఎల్ యూనివర్సిటీ వీసీ, సిబ్బంది. అనంతరం వివేకానంద జన్మదిన వేడుకలలో భాగంగా జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న యువతకు మంత్రి రోజా ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులకు చదువుతోపాటు యూత్ ఫెస్టివల్స్ లో పాల్గొనడం కూడా ముఖ్యమేనని, ఎదిగేందుకు ఇది చక్కని అవకాశమని అన్నారు. అంతే కాదు కాసేపు విద్యార్థులతో సరదాగా గడిపి.. వారితో కలిసి క్లాసికల్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.