సిరివెన్నెల సీతారామశాస్త్రి క‌న్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యూమోనియాకు చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన.. ఈనెల 24 తీవ్ర అస్వస్థతో సికింద్రాబాద్‏లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటినుంచి ఆయనకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‏ మరింత తీవ్రమవడంతో కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.

ఇక తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతోంది. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల. లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

1986లో సిరివెన్నెల చిత్రంతో గేయ రచయితగా పరిచయమయ్యారు. అలా సిరివెన్నెల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. సిరివెన్నెల చిత్రానికి గాను ఆయన ఉత్తమ లిరిసిస్ట్ గా నంది అవార్డు అందుకున్నారు. శృతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/