ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలి – మోడీ

Opposition parties are spreading lies on electoral bonds: PM Modi

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ విడతలో 10రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 96నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగుతోంది. నాలుగో దశలో ప్రధాన రాజకీయ పక్షాలతో కలిపి మొత్తం 1,717మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, ఉత్తర్​ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, బంగాల్‌లో 8 చొప్పున, బిహార్‌లో 5, ఒడిశా, ఝార్ఖండ్‌లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. ఒడిశాలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలకు నాలుగువిడతల్లో ఓటింగ్ జరగనుంది.

ఈ సందర్భాంగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లందరూ భాగం కావాలని ప్రధాని మోదీ కోరారు. 96 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటారని, యువత, మహిళలు దీనికి బలం చేకూరుస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.