హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత

హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి పై దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. వైసీపీ నేతల కార్లపై రాళ్లతో దాడులకు పాల్పడడంతో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త నవీన్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.

ఇక తెలంగాణ లోని నారాయణఖేడ్ లోని 175 పొలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ నాయకులపై దాడి చేశాడు కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ తమ్ముడు నగేష్ షెట్కార్. బీజేపీ కార్యకర్తని కాలితో తన్నాడు నాగేష్ షెట్కార్. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.