వన్ ఎర్త్ – వన్ హెల్త్ : జీ7సదస్సు వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ

ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సహకారం కావాలని పిలుపు

వన్ ఎర్త్ – వన్ హెల్త్ : జీ7సదస్సు వీడియో కాన్ఫరెన్స్ లో  మోడీ
Modi at the G7 summit video conference

New Delhi: ‘వన్ ఎర్త్ – వన్ హెల్త్’ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం జీ7 దేశాల సదస్సులో ఆయన తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సెకండ్ వేవ్ తో అల్లాడిపోయిన భారత్ కు అండగా ఉన్న జీ7 దేశాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు. అంతర్జాతీయ ఆరోగ్య విధానానికి ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, దానికి తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు ఐక్యతగా ముందుకు సాగాలని అన్నారు.

భారత్ కు బ్రిటన్, కెనడా సహా అనేక దేశాలు సహకారం అందించాయని , కరోనా విజృంభణ సమయంలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, కాన్సన్ ట్రేటర్లు వంటి వనరుల కొరత ఎదుర్కొన్న భారత్ కు సాయం చేశాయని తెలిపారు. భవిష్యత్ మహమ్మారిలను నివారించడానికి ప్రపంచ ఐక్యత, నాయకత్వం, సహకారం కావాలని జీ-7 వేదికగా ప్రధాని పిలుపునిచ్చారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/