సిఎం అధ్యక్షతన 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్‌ భేటీ

kcr cabinet meeting updates
CM-KCR

హైదరాబాద్‌ః రాష్ట్ర కేబినెట్ మధ్యాహ్నం 2గంటలకు సీఎం క్యాంప్ ఆఫీసులో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, దళిత బంధు తదితర అంశాలపై మీటింగ్ లో చర్చిస్తారు. సొంతింటి స్థలం ఉన్న నిరుపేదలకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడంపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాల తేదీలను కేబినెట్ మీటింగ్ లో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. సమావేశాల్లో ఏ అంశాలపై చర్చించాలన్న విషయం కూడా మీటింగ్ లో ప్రస్తావనకు వచ్చే ఛాన్సుంది. మరోవైపు గత అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదించిన 6 బిల్లులకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలుపలేదు. ఈ 6 బిల్లులపై ఎలా ముందుకెళ్లాలన్న ఇష్యూ ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/