అందుబాటులోకి కరోనా నాజల్ టీకా..ధర ఎంతంటే ..!

వరల్డ్ వైడ్ గా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. చైనా లో కరోనా విలయతాండవం కొనసాగుతుండడం తో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. మళ్లీ కరోనా ఆంక్షలు విధిస్తున్నారు. కేంద్రం సైతం అన్ని రాష్ట్రాలకు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఈ క్రమంలో నాజల్ టీకా అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన ముక్కు ద్వారా తీసుకునే టీకా ‘ఇన్‌కోవ్యాక్’ వచ్చే నెల నాలుగో వారం నుంచి కొవిన్ యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. సింగిల్ డోస్ టీకా అయిన దీనిని ప్రభుత్వాసుపత్రులు, ఆరోగ్య, టీకా కేంద్రాల్లో వేయించుకోవచ్చు. దీని ధర వచ్చేసి కేవలం రూ. 325 మాత్రమే.

ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఈ టీకాను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే, అక్కడ దాని ధరను రూ. 800గా నిర్ధారించినప్పటికీ జీఎస్టీ, అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు కలుపుకుని రూ. 1000 అవుతుంది. గతంలో ఎవరు ఎలాంటి టీకా వేయించుకున్నా ప్రికాషన్ డోసుగా దీనిని వేయించుకోవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు టీకా తీసుకోకుంటే దీనిని రెండు డోసుల టీకాగా కూడా ఉపయోగించుకోవచ్చు.