చైనాలో గ్యాస్ పైప్ లైన్ పేలుడు: 12 మంది మృతి
వందలాది మందికి తీవ్ర గాయాలు

Beijing: చైనాలోని హుబే ప్రావిన్స్ లో ఆదివారం ఉదయం గ్యాస్ పైప్ లైన్ పేలుడు జరిగింది. ఈ ఘోర ఘటనలో 12 మంది మృతి చెందారు. 138 మంది గాయపడ్డారు.ఈ మేరకు అధికారులు వెల్లడించారు. పేలుళ్ల ధాటికి అనేక ఇళ్లు కూలిపోయాయని తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 37 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయారని అంటున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటికే దాదాపు 150 మందిని రక్షించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/