మురుగునీటిలో రోడ్డు కాంట్రాక్టర్ ను కూర్చోబెట్టిన శివసేన ఎమ్మెల్యే

పనులు సక్రమంగా చేయలేదని మండిపాటు!

Shiv Sena MLA angry over road contractor
Shiv Sena MLA Dilip Lande angry over road contractor

భారీ వర్షాలకు ముంబయి సహా పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాందివాలీ ప్రాంతంలో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తుండడంతో స్థానిక శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు డ్రైనేజీ పనుల క్రాంటాక్టరును తీసుకువచ్చారు. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిలో సదరు కాంట్రాక్టర్‌ను కూర్చోబెట్టి పారిశుద్ధ్య కార్మికులతో అతడిపై చెత్త వేయించారు. కాంట్రాక్టర్‌ పనులు సక్రమంగా చేయలేదని మండిపడ్డారు. రోడ్లపై మురికినీరు నిలవడానికి ఆ కాంట్రాక్టరే కారణమని, తన విధి నిర్వహణలో అతడు విఫలమయ్యాడని ఎమ్మెల్యే దిలీప్ ఆరోపించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/