కవిత బెయిల్ ఫై విచారణ

BRS-mlc-kavitha-bail-petition-rejected-by-rouse-avenue-court
BRS MLC Kavitha judicial remand extend to May 20

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఫై ఈరోజు , రేపు విచారణ కోర్ట్ లో వాదనలు జరగనున్నాయి. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు, అలాగే కవిత అరెస్ట్‌కు ట్రయల్ కోర్టు సీబీఐకి అనుమతి, కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఆమె వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై గత శుక్రవారం సింగిల్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

లిక్కర్ స్కాంలోని 50 మంది నిందితుల్లో కవిత మాత్రమే మహిళ అని, మహిళా చట్టాల ప్రకారం ఆమెకు బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అయితే, కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా, సీబీఐ మాత్రం సమయం కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. సోమవారం కవిత వాదనలు, మంగళవారం ఈడీ, సీబీఐల వాదనలు పూర్తి చేయాలని ఆదేశించింది.