BRS ఓటమికి కారణం అదే అంటూ ఎమ్మెల్సీ రవీందర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. ఆసరా పెన్షన్లు , సంక్షేమ పథకాలు , అభివృద్ధి ఇవన్నీ మరోసారి అధికారం కట్టపెడతాయని భావించినప్పటికీ ..ప్రజలు మాత్రం స్పష్టంగా మార్పు కోరారు. ఒక్కసారిగా కాంగ్రెస్ కు అవకాశం ఇద్దామని తేల్చేసారు. ప్రస్తుతం ఓటమి ఫై బిఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్సీ రవీందర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జోకుడు బ్యాచ్‌కు అధిష్టానం ప్రీయార్టి ఇచ్చిందని , అసలు విషయాలను తెలుసుకునేందుకు కూడా అధిష్టానం ఇష్టపడలేదని ఆరోపించారు. ఓటమి తర్వాత రియలైజేషన్ కరెక్ట్ కాదని, తొక్కుడు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ఓడిందని స్పష్టంచేశారు.

వాస్తవాలు చెప్తే వినేందుకు కూడా అధిష్టానం ఇష్టపడలేదన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటమి పాలకుర్తి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారని చెప్పారు. పార్టీ గెలుపుపై ఊహాగానాలు ఎక్కువై వాస్తవాలు మర్చిపోయారని, తాను ఇంచార్జ్‌గా ఉన్న జిల్లాలో ఓటమికి కారణం స్థానిక రాజకీయాలేనని విమర్శించారు. 2014, 2018లో పక్క పార్టీలో గెలిచిన వాళ్లను బీఆర్ఎస్ పార్టీలోకి లాగారని, వచ్చిన వాళ్ళు రియల్ బీఆర్ఎస్ లీడర్లను తొక్కారని విమర్శించారు.