రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

TS Assembly

హైదరాబాద్‌: రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. నేటి ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేశారు. సభ‌లో మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా చ‌ర్చ చేప‌ట్టి, భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కేంద్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం కోర‌నుంది. తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 28వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. శాస‌న‌స‌భ‌లో రేపు కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 10, 11వ తేదీల్లో కొత్త రెవెన్యూ చ‌ట్టంపై చ‌ర్చ నిర్వ‌హించ‌నున్నారు. ‌


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/