ఢిల్లీలో సీఎం రేవంత్ అధికారిక నివాసం ఖరారు

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసాన్ని ఖరారు చేసారు. ఢిల్లీ తుగ్లక్‌రోడ్‌లోని బంగ్లా 23 రేవంత్ రెడ్డికి అధికారిక నివాసంగా కేటాయించారు. గత 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో బంగ్లా నెంబర్‌ 23లోనే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాకపోవడంతో కేసీఆర్ బంగ్లాను ఖాళీ చేశారు. ఇక ఇప్పుడు దానిని రేవంత్ కు కేటాయించారు. సీఎం హోదాలో అదే బంగ్లాలో రేవంత్‌రెడ్డి ఉండనున్నారు. ఇన్ని రోజులు ఎంపీగా రేవంత్ రెడ్డి.. ఎంపీ క్వార్టర్స్‌లో ఉన్నారు. ఢిల్లీ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించి అందులో కాలుమోపనున్నారు.