ఇంటి వద్ద నుంచే తాతకు నివాళి

కరోనా నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లకూడదని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయం

Jr NTR And Kalyan Ram

హైదరాబాద్‌: దివంగత సిఎం, టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ జయంతి రేపు( మే 28) ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆయన కుటుంబ సభ్యులందరూ హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి, నివాళి అర్పించడం ఆనవాయతీగా వస్తోంది. అయితే రేపు ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/