జీఎస్టీ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి తలసాని

minister-talasani-proposed-gst-amendment-bill-in-telangana-assembly

హైదరాబాద్‌ః మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు శాసనసభలో ‘తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022’ ను ప్రవేశపెట్టారు. ‘‘జీఎస్టీ పన్ను చెల్లింపు నగదు లేదా క్రెడిట్ ద్వారా చేయొచ్చు. అయితే క్రెడిట్ ద్వారా చెల్లించే పన్ను మొత్తానికి పరిమితులు విధించడం ద్వారా అవకతవకలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వాలి’’ అనే అంశాన్ని సవరణ బిల్లులో ఆయన ప్రతిపాదించారు.

‘‘సంవత్సరానికి ఒకసారి రిటర్న్ లు దాఖలు చేసేవారు, గడువు తేదీ ముగిసిన తర్వాత మూడు నెలల్లోగా రిటర్న్ దాఖలు చేయకుంటే రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలి’’ అని ప్రతిపాదించారు. రిటర్న్ ను లేట్ గా దాఖలు చేస్తే.. రాష్ట్ర సర్కారు లేట్ ఫీజు వసూలు చేస్తుందన్నారు. క్రెడిట్ స్థాయి పరిమితమైతేనే ఆదాయపు పన్ను మినహాయింపు (ఐటీసీ)ను క్లెయిమ్ ను చేసుకునేలా జీఎస్టీ బిల్లులో మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తప్పుగా ఐటీసీ క్లెయిమ్ చేస్తే వడ్డీ విధించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. కాసేపు చర్చ జరిపిన అనంతరం ‘తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2022’కు సభ ఆమోదం తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/