అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన పునః ప్రారంభం

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి సిబితా రెడ్డి.. హైదరాబాద్‌లోని మెహబూబియా స్కూల్‌కు వచ్చారు. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్ కమ్ చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మొదటి రోజు పాఠశాలలకు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని చెప్పారు. రాష్ట్రంలోని గురుకులాల్లో సుమారు 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. గురుకుల సూల్స్‌లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పారు. బడిబాట కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నదని వెల్లడించారు. ఎప్పటిలాగానే విద్యార్థులకు జులై మొదటి, రెండో వారంలో పుస్తకాలు, యూనిఫార్మ్స్ అందిస్తామన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన మొదలు పెట్టామని.. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా సర్కారు బడులు ఉంటాయని మంత్రి అన్నారు. మన ఊరు మనబడి కింద స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/