టైమ్‌ ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్’ ‌గా బైడెన్‌- హారిస్‌

టైమ్‌ 'పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్' ‌గా బైడెన్‌- హారిస్‌
Time Magazine Names Joe Biden, Kamala Harris Person of the Year

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన, కమలా హ్యారిస్‌లను ప్రముఖ టైమ్ మ్యాగ్జైన్ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్‌’గా ఎంపిక చేసింది. టైమ్ తన కవర్ పేజీపై బైడెన్, హ్యారిస్ ఫొటోలను ‘చేంజింగ్ అమెరికాస్ స్టోరీ’ పేరిట ముద్రించనుంది. ఈ మేరకు టైమ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఫైనలిస్ట్‌గా నిలిచిన అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లను దాటి బైడెన్, కమల ఈసారి టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్‌’గా నిలవడం విశేషం. చేంజింగ్ అమెరికాస్ స్టోరీ అన్న స‌బ్‌టైటిల్ ఆ ఫోటోకు ఇచ్చారు.

తాజాగా ముగిసిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో బైడెన్ 306 ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్ల‌తో ట్రంప్‌ను ఓడించారు. ట్రంప్‌కు కేవ‌లం 232 ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ క‌న్నా.. బైడెన్‌కు సుమారు 70 ల‌క్ష‌ల ఓట్లు అధికంగా పోల‌య్యాయి. ఒక క్యాలండ‌ర్ సంవ‌త్స‌రంలో అధిక ప్ర‌భావం చూపిన వ్య‌క్తుల‌ను టైమ్ మ్యాగ్జిన్ త‌న క‌వ‌ర్‌పేజీలో ప్ర‌చురిస్తుంది. వారినే ప‌ర్స‌న్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డుతో స‌త్క‌రిస్తున్న‌ది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/