బండి సంజయ్ విమర్శలకు బిఆర్ఎస్ కౌంటర్

ఏప్రిల్ 01 సందర్బంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్..ట్విట్టర్ ద్వారా ‘‘ఓ నిరుద్యోగి ఫోన్ కు వచ్చిన మెసేజ్’’ అని రాసి ఉన్న ఓ ఫొటోనుతో పాటు సీఎం కేసీఆర్ అన్న అప్పటి మాటలను క్యాప్షన్ లో చేర్చారు. దాంతో పాటు మీరు దీనిని నమ్మితే ఏప్రిల్ ఫూల్స్ డే శుభాకాంక్షలు అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు. బండి సంజయ్ షేర్ చేసిన ఈ ఫొటోలు‘‘మీ అకౌంట్ లో రూ.3,016 పడ్డాయి’’ అనే మెసేజ్ ఇంగ్లీష్ లో ఉంది. దాని కిందే సీఎం కేసీఆర్ నవ్వుతున్న ఫొటోను షేర్ చేస్తూ పోస్ట్ చేసారు.

దీనిపై బిఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. ‘‘ఫూల్స్ డే: దేశంలో దీన్ని ‘అచ్చే దిన్’ అంటారు. మనల్ని మన ‘విశ్వ గురు’ ఎలా ఫూల్ చేశారో గుర్తు చేసుకుందాం’’ అని రాసి ఉన్న పోస్టర్ ను బీఆర్ఎస్ షేర్ చేసింది. బుల్లెట్ ట్రైన్, అందరి ఖాతాల్లో రూ.15 లక్షలు, అందరికీ ఇళ్లు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించడం, స్మార్ట్ సిటీలు, మహిళా భద్రత.. ఇలా అన్ని విషయాల్లో ఫూల్ చేశారని ఆరోపించింది. రవితేజ తాజా సినిమా ‘రావణాసుర’లోని డైలాగ్ ను గుర్తు చేసేలా.. ‘‘ప్రజలను మోసం చేయడం ఒక కళ అయితే.. మోడీ జీ అందులో పికాసో’’ అని సెటైర్ పేల్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.