నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా

నారా లోకేష్ vs మంత్రి రోజా మాటల యుద్ధం నడుస్తుంది. యువగళం పాదయాత్ర లో లోకేష్ ..మంత్రి రోజా ను డైమండ్ రోజా అని , జబర్దస్త్ ఆంటీ అంటూ విమర్శలు చేయడం తో రోజా లోకేష్ ఫై విమర్శల వర్షం కురిపించింది. రెండు రోజులుగా వార్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో గురువారం నగరిలో మంత్రి రోజా పర్యటించారు.

ఈ సందర్భంగా లోకేశ్ పై ఈ సంచలన కామెంట్స్ చేశారు. ” లోకేశ్ ఒక వెంటకారపు, పనికిమాలిన మనిషి. అతని పాదయాత్ర మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చేసింది జీరో మాత్రమే. తన కోసం వచ్చిన తారకత్న గుండెపోటుకు గురై.. ఆస్పత్రి పాలైతే.. కనీసం తిరిగి కూడా చూడకుండా, బాధలేకుండా సంతోషంగా పూలు దండలు వేయించుకుంటూ ఎలా పాదయాత్ర చేశాడో అందరం చూశాం. సొంత కుటుంబ సభ్యుడికే ఏదైనా జరిగితే పట్టించుకోని వ్యక్తి, రేపు అధికారంలోకి వస్తే మనకి ఏమి చేస్తాడు అనే సందేహం ప్రజల్లో కలిగింది. అందుకే పాదయాత్రకు ప్రజలు ఎవరూ రావడం లేదు. 20 గంటల పాటు టెంటులో దాక్కుని జనాన్ని బలవంతంగా లాక్కొస్తున్నా.. రాని పరిస్థితిలో ఆయన సభలు జరుగుతున్నాయి అంటూ రోజా ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరి రోజా కామెంట్స్ ఫై లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం లోకేష్ యువగళం యాత్ర నేటికీ 21 వ రోజు పూర్తి చేసుకుంది. సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది.