రాకేశ్ టికాయ‌త్‌ కు బెదిరింపు కాల్

రైతుల హ‌క్కుల కోసం పోరాడుతోన్న బీకేయూ నేత రాకేశ్ టికాయ‌త్‌

న్యూఢిల్లీ : రైతుల హ‌క్కుల కోసం పోరాడుతోన్న బీకేయూ నేత రాకేశ్ టికాయ‌త్‌ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్య‌క్తి బెదిరించాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఓ గుర్తు తెలియ‌న‌ వ్య‌క్తి ఫోన్ చేసి ఈ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని బీకేయూ నేత పెర్జివాల్ త్యాగి చేసిన‌ ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

టికాయ‌త్‌ను ఆ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి తిట్టిన‌ట్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్‌ పోలీసులు వివ‌రించారు. సివిల్ లైన్స్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు న‌మోదు చేసుకున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఎస్ఐ రాకేశ్ శ‌ర్మ నేతృత్వంలోని పోలీసుల బృందం టికాయ‌త్ ఇంటికి వెళ్లింద‌ని, ద‌ర్యాప్తు ప్రారంభించింద‌ని వివ‌రించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/