మంచు లక్ష్మి పెట్టిన వీడియోపై నెటిజన్లు ట్రోల్స్

మంచు లక్ష్మి తాజాగా పోస్ట్ చేసిన మంచు మనోజ్ పెళ్లి వీడియో ఫై నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం మంచు విష్ణు – మనోజ్ ల మధ్య గొడవ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కూడా ఎవరికీ కూడా వీరి మధ్య గొడవలు నడుస్తున్నాయని ఎవ్వరికి తెలియదు..కానీ మనోజ్ పెట్టిన పోస్ట్ తో యావత్ సినీ ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీడియా చానెల్స్ లలో కూడా హైలైట్ గా నడిచింది. ఈ క్రమంలో మోహన్ బాబు ఈ గొడవ ను చల్లార్చారు. మనోజ్ ఫై సీరియస్ కావడం తో తాను పోస్ట్ చేసిన ట్వీట్ ను తీసివేసాడు. ఆ తర్వాత ఈ గొడవ గురించి ఎక్కడ ప్రస్తావన రాలేదు.

ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో మనోజ్ పెళ్లి వీడియో ను పోస్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ వీడియో లో మ‌నోజ్‌ను పెళ్లి కొడుకుని చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తూ పెళ్లి కొడుకు అనే క్యాప్ష‌న్‌ను యాడ్ చేసింది. అయితే నెటిజన్స్ మాత్రం కామెంట్స్ రూపంలో రివ‌ర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. వీడియోలో విష్ణు అంకుల్ ఎక్క‌డ? అని ఓ నెటిజన్ ప్ర‌శ్నించాడు. మ‌రొక‌రైతే మీ ఇంట్లో గొడ‌వకు నువ్వు పెట్టిన పోస్ట్‌కి ఏమైనా సంబంధం ఉందా? అందుకే మిమ్మ‌ల్ని ట్రోల్ చేసేద‌ని కామెంట్ పెట్టాడు. మొత్తం మీద ప్రస్తుతం ఈ పోస్ట్ ఫై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ వస్తున్నారు.