సీఎం జగన్ ను కలిసిన చాగంటి కోటేశ్వరరావు

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురువారం సీఎం జగన్ ను కలిశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకొని సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియ‌మితులైన విష‌యం విధిత‌మే. ఈ సంద‌ర్భంగా చాగంటికి శ్రీ‌వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమ అందజేసి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి స‌త్క‌రించారు.

అలాగే ముఖ్యమంత్రిని శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి క‌లిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు, కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి సంద‌ర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు.