అయ్యాప్పస్వామి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ విడుదల

అయ్యాప్పస్వామి ఫై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ బెయిల్ బయటకు వచ్చారు. నెల రోజుల క్రితం బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై.. శివకేశవులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు పోలీస్‌స్టేషన్లలో బైరి నరేష్ పై కేసులు నమోదయ్యాయి.

దీంతో పోలీసులు నరేష్ ను అదుపులోకి తీసుకొని చర్ల పల్లి జైలు కు తరలించారు. ఇక ఈరోజు కొడంగల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో అతడి విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక బైరి నరేష్ బెయిల్ మంజూరు కావడంతో అతని కుటుంబ సభ్యులు, నాస్తికవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు