వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతోమంత్రి ఈటల భేటి

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో… ఇంకా ఎంత మంది అవసరమవుతారనే దానితో పాటు.. ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన పరికరాలు కొనుగోలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎక్కడా కొరత లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఉన్న మెడికల్ కాలేజీల్లో కోవిడ్ పేషెంట్లను చేర్చుకునేందుకు రెడీ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/