సైకిల్ కే నా ఓటు అంటూ మంత్రి ధర్మానకు షాక్ ఇచ్చిన మహిళ

ఏపీలో అధికార పార్టీ నేతలకు వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోనే కాదు బయట కార్యక్రమంలో కూడా నేతలకు ప్రజల నుండి షాకులు తప్పడం లేదు. చుట్టూ వైస్సార్సీపీ నేతలు ఉన్న..ఎదురుగా ప్రభుత్వ పధకాలు కనిపిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం సైకిల్ కే జై అనడం..మరికొంతమంది నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పడం చేస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళా మాములు షాక్ ఇవ్వలేదు. మీ ఓటు ఎవరికీ అంటే ఆమె ఏమాత్రం ఆలోచించకుండా సైకిల్ కే అనేసింది. ఈమె ఇచ్చిన సమాధానం తో మంత్రికి నోటివెంట మాట కూడా రాలేదు.

వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రాన్ని మంత్రి అందించారు.. తర్వాత ఏ పార్టీకి ఓటేస్తావని అడిగారు. ఆమె వెంటనే ‘సైకిల్‌కు వేస్తా’ అనేసింది. మహిళ సమాధానంతో మంత్రి షాక్ తిన్నారు. ‘ఏయ్‌ చూడండి.. ఈవిడ సైకిల్‌కు ఓటేస్తుందట’ అని మంత్రి అన్నారు. మహిళ సమాధానంతో అక్కడున్న వైస్సార్సీపీ నేతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎవరికైనా ఓటేసుకోవచ్చు.. కానీ గోతిలో పడిపోతారు జాగ్రత్త అంటూ మంత్రి ధర్మాన హెచ్చరించారు. ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబు మోసం చేసేందుకు మళ్లీ హామీలు ఇస్తున్నారుని.. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.